calender_icon.png 15 November, 2024 | 9:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుకర్ ప్రైజ్ విజేతగా సమంత

15-11-2024 12:34:27 AM

అవార్డు గెలుచుకున్న మొదటి మహిళగా రికార్డు

న్యూఢిల్లీ, నవంబర్ 14: ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్‌ను ఈ ఏడాదికిగాను బ్రిటిష్ రచయిత్రి సమంత హార్వేను వరించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని ఆరుగురు వ్యోమగాముల జీవితంలో విషయాలను ఆర్బిటాల్ అనే నవల రూపంలో రాసినందుకు గాను ఆమె ఈ ప్రైజ్‌కు ఎంపికయ్యారు. ఈ అవార్డు గెలుచుకున్న తొలి మహిళ కూడా ఆమెనే. ఈ బహుమతి కింద ఆమెకు 50వేల పౌండ్లు (రూ.53లక్షలు) అందజేయనున్నారు. మొత్తం 136 పేజీలతో ఉన్న ఈ నవలలో ఐఎస్‌ఎస్ లో ఆరుగురు వ్యోమగాముల జీవితంలో జరిగే విషయాల గురించి సమంత వివరించారు. భూమిపై 16 సూర్యోదయాలు, సూర్యాస్తమయాల గురించి ఈ నవలలో వివరంగా ఉంటుంది. అంతరిక్షంలో జరిగిన విషయాలపై మొదటిసారిగా బుకర్ ప్రైజ్ గెలిచిన నవల కూడా ఇదే కావడం విశేషం.