calender_icon.png 26 October, 2024 | 11:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెట్టింట్లో వైరల్: రెండో వివాహంపై సమంత షాకింగ్ కామెంట్స్

26-10-2024 10:03:14 AM

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు రెండో వివాహంపై చేసిన షాకింగ్స్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సిటాడెల్ వెబ్ సిరీస్  ప్రమోషన్ లో బిజీ బిజీగా ఉన్నా సామ్, నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరిగానే ఉంది. ఇష్టపడి వివాహం చేసుకున్న ఈ జంట వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయిన ప్రస్తుతం కెరీర్ పై ఫోకస్ పెట్టారు. కాగా, తాజాగా నాగ చైతన్య రెండో పెళ్లికి సిద్దమయ్యాడు. శోభిత ధూళిపాళతో పెళ్లి పీటలెక్కనున్నాడు.

సమంత మాత్రం సినిమాలపై దృష్టి పెట్టింది. ఫ్యామిలీ మ్యాన్-2 ఫేమ్ రాజ్ అండ్ డీకే ద్వయం దర్శకత్వంలో సామ్ నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్: హనీ బన్నీ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో సిటాడెల్ పై వరస ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు సమంత. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఈ సిరీస్ పై అంచనాలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. రెండో పెళ్లిపై షాకింగ్స్ కామంట్స్ చేశారు. నేను లవ్ చేసి, ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. కానీ, విడిపోయాం. అందుకే రెండో వివాహంపై ఎలాంటి ఆలోచన లేదన్నారు. తనకు మరో వ్యక్తి అవసరం లేదని చెప్పిన సమంత ప్రస్తుతం సంతోషంగానే ఉన్నానని పేర్కొన్నారు.