26-02-2025 10:52:16 PM
సమంత గత రెండేళ్లుగా వెండితెరపై కనిపించింది లేదు. అయినా కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. భాషలకు అతీతంగా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం తిరిగి కెరీర్ మొదలు పెట్టింది కానీ చాలా స్లోగా వ్యవహరిస్తోంది. అమ్మడు ఊ అంటే ఆమెతో సినిమా తీసేందుకు దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉన్నా కూడా స్పందన అయితే రావడం లేదు. అయితే ఇటీవలి కాలంలో సమంత తను చేస్తున్న చిత్రాల కంటే కూడా సోషల్ మీడియాలోనూ.. అలాగే పలు ఇంటర్వ్యూలలో ఆమె చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. తన సినిమాలు తన ఫస్ట్ లవ్ అని.. ఇకపై తన ప్రేమకు దూరంగా ఉండలేనని చెప్పింది. “సినిమాలు నా ఫస్ట్ లవ్. ఇప్పటికే చాలా గ్యాప్ ఇచ్చాను. ఇకపై నేను నటనకు దూరంగా ఉండను. తిరిగి వరుస సినిమాలతో మీ ముందుకు వస్తా” అని చెప్పింది సమంత. ఆమె వ్యాఖ్యలతో ఫ్యాన్స్ అయితే ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం సమంత ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రంతో పాటు ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.