ప్రముఖ నటి సమంతా రూత్ ప్రభు(Samantha Ruth Prabhu,) ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వైరల్ అవుతున్న సమంత బేబీ బంప్ ఫొటోస్(Samantha Baby Bump Photos) చూసిన నెటిజన్లు, ఆమె అభిమానులు షాకవుతున్నారు. అసలు ముచ్చట ఏంటంటే.. సమంత(Samantha) ఫొటోలను ఆకతాయిలు ఏఐని ఉపయోగించి క్రియేట్ చేసి నెట్టింట్లో పెట్టారు. గతంలో కూడా సమంత గర్భవత(Pregnant)ని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానిపై స్పందించిన సమంత తనకు మాతృత్వాన్ని అనుభవించాలని ఉందని, ఈ ప్రచారాన్ని నమ్మొద్దంటూ కొట్టిపారేశారు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సామ్ పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. టాలీవుడ్(Telugu cinema) లో టాప్ హీరోయిన్ గా వెలుగువెలిగిన సమంత ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని వారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.