calender_icon.png 28 April, 2025 | 9:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శుభంలో మాతాజీగా సమంత

28-04-2025 01:21:24 AM

తన సొంత ప్రొడక్షన్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సమంత నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’. ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ మూవీ మే 9న విడుదల కానుంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. మే 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుందీ సినిమా.

ఈ నేపథ్యంలో ఆదివారం ఈ చిత్రం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. హాస్యం, హర్రర్, ఉత్కంఠ, భావోద్వేగాలు ఇలా అన్ని అంశాలతో ఈ సినిమా రూపొందినట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఊళ్లోని మహిళలంతా టీవీ సీరియల్స్ చూస్తూ దయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తారు. వారి వింత పరిస్థితి కారణంగా అష్టకష్టాలు పడే పురుషులు ఆ సమస్య నుంచి తప్పించుకునేందుకు ఏం చేశారు అనేదే సినిమా కథ అని అర్థమైంది.

ఈ చిత్రంలో సమంత మాతాజీగా ప్రత్యేక పాత్ర పోషించినట్టు ట్రైలర్ ద్వారా వెల్లడయింది. ఊళ్లో పురుషులంతా సీరియల్ భూతం నుంచి తమ భార్యలను కాపాడుకునేందుకు మాతాజీ చూపించిన పరిష్కార మార్గం ఏమిటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేనని అర్థమైంది.