కామారెడ్డి,(విజయక్రాంతి): తమ సమస్యలను పరిష్కరించాలని నిరవధికంగా చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు రోడ్లు ఊడిచి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్ మహిళా అధ్యక్షురాలు వాసంతి నాయకులు సంతోష్ రెడ్డి శైలజ కాళిదాసు శ్రీవాణి లావణ్య గంగా ప్రసాద్ లక్ష్మణ్ రాజు మాధవి మౌనిక సూర్య పాల్ వీణ రాములు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.