calender_icon.png 15 November, 2024 | 12:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా చేపట్టాలి

14-11-2024 03:24:37 PM

మందమర్రి,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వేను మండలంలో పకడ్బందీగా చేపట్టాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేశ్వర్ సూచించారు. ఇంటింటి సర్వేలో భాగంగా గురువారం మండలంలోని శంకరపల్లి గ్రామ పంచాయతీలో చేపట్టిన సర్వేను ఆయన పరిశీలించి ఎన్యుమరేటర్లు చేపట్టిన సర్వే, కుటుంబ సర్వే పత్రాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా గ్రామాల్లోని ప్రతి ఇంటికి  ఎన్యుమరేటర్లు వచ్చి సర్వే నిర్వహిస్తారన్నారు. గ్రామస్థులు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు,ధరణి పాస్ పుస్తకాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

ప్రజలు సర్వే సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి నిమ్మకంటి రాజేష్, ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు. మండలంలోని శంకరపల్లి గ్రామంలోని నర్సరీనీ ఎంపీడీఓ రాజేశ్వర్ సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన నర్సరీలో మొక్కల పెంపకం పటిష్టంగా చేపట్టి వాటిని సంరక్షించాలని సూచించారు. మొక్కలకు నీరు సమృద్ధిగా పట్టించాలని వన సేవక్ లకు  సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి నిమ్మకంటి రాజేష్,కారోబార్ హర్ష, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.