calender_icon.png 18 November, 2024 | 1:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వేలో వివరాలు స్పష్టంగా నమోదు చేయాలి

09-11-2024 07:09:53 PM

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,(విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో కుటుంబ సభ్యుల వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ మున్సిపల్ పరిధిలో గల 5, 6 ,17 వార్డులు, మంచిర్యాల మున్సిపల్ పరిధిలో గల 5వ వార్డులలో ఆయా మున్సిపల్ కమిషనర్లు సతీష్, మారుతీ ప్రసాద్ లతో కలిసి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ... సర్వే ప్రక్రియలో భాగంగా ఇండ్ల జాబితా ప్రక్రియ పూర్తి అయినందున కుటుంబ సభ్యుల సర్వేలో వివరాలు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. ఇండ్ల జాబితా ప్రక్రియ పూర్తి అయినందున కుటుంబ సభ్యుల సర్వే కార్యక్రమం కొనసాగుతుందని, ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన బ్లాక్ లలో పూర్తిస్థాయిలో కుటుంబ సభ్యుల వివరాలు నిర్ణీత నమూనాలో స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. సర్వే ముందు రోజు ఏ ప్రాంతంలో సర్వే నిర్వహిస్తున్నారో సంబంధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని, ఇంటి యజమానులు అవసరమైన పత్రాలతో హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.