calender_icon.png 9 January, 2025 | 3:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామ్ ఆల్ట్‌మాన్ నన్ను లైంగికంగా వేధించాడు

09-01-2025 01:29:15 AM

  • ఓపెన్‌ఏఐ సీఈవోపై అతడి సోదరి ఆరోపణ
  • నష్టపరిహారంగా 75వేల డాలర్లు డిమాండ్
  • ఆరోపణలు ఖండించిన సామ్ కుటుంబం

న్యూఢిల్లీ, జనవరి 8: ఓపెన్‌ఏఐ సీఈఓ, సహ వ్యవస్థపకుడు సామ్ ఆల్ట్‌మాన్‌పై అతడి సోదరి సంచలన ఆరోపణలు చేశారు. 1997 మధ్య తొమ్మిదేళ్లపాటు సామ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కోర్టులో దావా వేశారు. మూడేళ్ల వయసు నుంచే లైంగిక వేధింపులకు గురైనట్టు అన్నీ ఆల్ట్‌మాన్ తన దావాలో పేర్కొన్నారు.

తనకు జరిగిన నష్టానికి పరిహారంగా 75వేల డాలర్లను ఇప్పించాలని కోరారు. అయితే అన్నీ ఆల్ట్‌మాన్ ఆరోపణలను కుటుంబ సభ్యులు ఖండిం చారు. ఆమెకు మానసిక ఆరోగ్యం బాగాలేదని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు సంబంధించిన స్టేట్‌మెంట్‌ను సామ్ ఆల్ట్‌మాన్ తన  ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.