ట్విట్టర్ వేదికగా ఐటీమంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానం
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్‌ను హైదరాబాద్‌కు రావాలని ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఆహ్వానించారు. హైదరాబాద్ నగర బిర్యానీ, ఇరానీ చాయ్, బన్ మస్కాను ఆస్వాదించి, ఏఐ రంగంలో తెలంగాణ సాధిస్తున్న పురోగతిని పరిశీలించాలని కోరారు.
భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఏఐ మార్కెట్ అవుతుందని రెండు రోజుల కింద సామ్ ఆల్ట్‌మన్ కా మెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి ఇండియా ఏఐ సామర్థ్యా న్ని గుర్తించడం పట్ల హర్షం వ్యక్తం చే శా రు. నిజమైన ఏఐ యాక్షన్ అంతా హైదరాబాద్ కేంద్రంగా ఆవిష్కృతమవుతోం దని ట్విట్టర్‌లో మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.