- చివరగా 2013లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
- 11 ఏళ్లుగా నియామకాలు నిల్
- తొలుత సగం భర్తీకి సీఎం రేవంత్ అంగీకారం?
- విశ్వవిద్యాలయాల ద్వారానే నియామకాలు!
- త్వరలో నిర్ణయం వెల్లడించనున్న ప్రభుత్వం
హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): “గతంలో వీసీలను నియమిం చకపోవడంతో యూనివర్సిటీలు నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. అందుకే రాష్ట్రం లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే వీసీలను నియమించాం. అలాగే త్వరలోనే యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయబోతున్నాం.”
అని గురువారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బాలల దినోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడంతో త్వరలోనే విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ పోస్టులకు మోక్షం లభించనుందనే చర్చ జోరుగా జరుగుతుంది.
ఇటీవల ముఖ్యమంత్రిని నూతన వీసీలు కలిసినప్పుడు కూడా ప్రొఫెసర్ పోస్టుల ఖాళీల గురించి ప్రస్తావించగా.. తొలుత 50శాతం ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పినట్లు సమాచారం. రాష్ట్రంలో మరో మూడు వర్సిటీలకు వీసీలను నియమించాల్సి ఉంది. వీరి నియామకం తర్వాతే ఖాళీల భర్తీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
11 ఏళ్లుగా నియామకాల్లేవ్..
ప్రతి నెలా ప్రొఫెసర్లు ఉద్యోగ విరమణ పొందుతుండగా.. వారి స్థానాల్లో కొత్త రిక్రూట్‌మెంట్ జరగడం లేదు. యూనివర్సిటీల్లో రెగ్యులర్ ప్రొఫెసర్లు తక్కువగా, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వ్యవస్థ ఎక్కువగా తయారైంది. విద్యాశాఖ పరిధిలోని 12 విశ్వవిద్యా లయాల్లో మొత్తం 2,825 పోస్టులను ప్రభు త్వం మంజూరు చేయగా.. ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా 870 మం ది మాత్రమే పనిచేస్తున్నారు.
మిగతా 1,980 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో 1,266 ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులుండగా.. 375 మంది మాత్రమే పనిచేస్తున్నట్లు సమాచారం. ఇలా రాష్ట్రంలోని ప్రతి వర్సిటీలో ఖాళీలు భారీగా ఉన్నాయి. చివరగా 2013 లో ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయగా.. ఆ తర్వాత నియామక ప్రక్రియ చేపట్టలేదు.
త్వరలో భర్తీ ప్రక్రియపై నిర్ణయం!
విశ్వవిద్యాలయాల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు గత ప్రభుత్వం రెండేళ్ల కిందటే యూనివర్సిటీ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డును తీసుకురాగా ఈ బోర్డు ఆమోదానికి సంబంధించిన దస్త్రం రాష్ట్రపతి కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నది. దీంతో యూనివర్సిటీలకు మళ్లీ పూర్వ వైభవం రానుంది. గతంలో ఏ యూనివర్సిటీల్లోని ఖాళీలను ఆ వర్సిటీయే భర్తీ చేసుకునే అధికారం ఉండేది.
కానీ అన్ని యూనివర్సిటీలు ఖాళీలను ఒకేసారి భర్తీ చేసేవి కావు. అవసరాలకు అనుగుణంగా నియామక ప్రక్రియను చేపట్టేవి. ఇలా చేయడం వల్ల అవినీతి జరిగే ఆస్కారం ఉందని భావించిన అప్పటి ప్రభుత్వం కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేసింది. అప్పట్లో ఈ బోర్డును యూనివర్సిటీలు, విద్యార్థి సంఘాలు, మేధావులు, ప్రొఫెసర్లు వ్యతిరేకించారు. వర్సిటీలపై రాష్ట్ర ప్రభుత్వ పెత్తనమేంటని విమర్శలొచ్చాయి.
అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ.. వర్సిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీయొద్దని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఖాళీల భర్తీ ప్రక్రియను వర్సిటీలకే అప్పగించే అవకాశం ఉంది. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలా? లేక యూనివర్సిటీలకు అప్పగించాలా? అనే అంశంపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయాన్ని వెలువరించనున్నట్లు సమాచారం.
ఫ్యాకల్టీ లేకుండా పరిశోధన ఎలా?
గవర్నర్ మొదలు సీఎం వరకు సందర్భం వచ్చినప్పుడల్లా యూనివర్సిటీలు కొత్త కొత్త పరిశోధనలు, నూతన ఆవిష్కరణలకు కేంద్రాలుగా మారాలని చెప్తుంటారు కానీ.. రాష్ట్రంలోని కొన్ని వర్సిటీల్లో పలు విభా గాలకు హెచ్‌వోడీలే కరువయ్యారు. సరిపడా టీచింగ్ ఫ్యాకల్టీ ఉండదు. సరైనా ఫ్యాకల్టీ లేకుండా పరిశోధనలు ఎలా సాధ్యమని విద్యార్థి సం ఘాలు ప్రశ్నిస్తున్నాయి.
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో సుమారు 4,500 టీచింగ్, నాన్‌టీచింగ్ ఖాళీలున్నాయి. ఈ ఖాళీల కారణంగా అభ్య ర్థులకు పరిశోధనల్లో తీవ్ర ఆటంకం కలుగుతోంది. నూతనంగా నియమితులైన వీసీలు తమ వర్సిటీల్లోని సమస్యలు, అవసరాలు, కొత్త కో ర్సులు, ఖాళీల వివరాల నివేదికలను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నివేదికల ఆధారంగానే ఖాళీల భర్తీపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది.