calender_icon.png 26 April, 2025 | 8:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములకు మోక్షం

26-04-2025 01:05:33 AM

తుంగతుర్తి శాసనసభ్యులు  మందుల సామెల్ 

యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 25 ( విజయ క్రాంతి ): భూవివరాలు రికార్డులలో  తప్పుగా నమోదైన , రికార్డుల్లో నమోదు కాకపోయిన  భూభారతి చట్టంతో (భూ భారతి  పోర్టల్)  సులభతరంగా పరిష్కరించుకోవచ్చని తుంగతుర్తి శాసనసభ్యులు   మందుల సామెల్ అన్నారు.

శుక్రవారం  యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో  అదనపు కలెక్టర్  (రెవెన్యూ) వీరారెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ హనుమంతరావు తో కలిసి  భూభారతి అవగాహన సదస్సు  నిర్వహించారు. ఈ సందర్భంగా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్  మాట్లాడుతూ... భూమి ఉన్న ప్రతి రైతుకు భూమి హక్కులను కాపాడేలా, కష్టాలను తీర్చేలా ప్రభుత్వం కొత్త భూ హక్కుల చట్టం భూ భారతి  (ఆర్ ఓ ఆర్ చట్టం) తీసుకొచ్చిందని, ఇక పై భూ సమస్యలు ఉండవని, భూ భారతి చట్టం ద్వారా పరిష్కారం అవుతాయన్నారు.   ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలు ఇకపై ఉండవన్నారు. ఈ కార్యక్రమంలో  ఆర్డీఓ కృష్ణ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.