calender_icon.png 15 March, 2025 | 5:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ నేలకు వందనం

15-03-2025 12:23:25 AM

  • ‘జనసేన’ ఆవిర్భావ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్
  • గద్దర్ తనను ప్రోత్సహించారంటూ ఆయనకు నివాళి 
  • తన పార్టీ మహిళా నేతలు రాణీరుద్రమదేవులంటూ కితాబు
  • బండి యాదగిరి పాట, దాశరథి కవితల ప్రస్తావన

అమరావతి, మార్చి 14: ‘నా జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థలం ఆంధ్రప్రదేశ్. తెలంగాణకు నాకు విడదీయలేని అనుబంధం ఉంది. తెలంగాణ అన్నదమ్ములు నాకు పునర్జన్మనిచ్చారు. అందుకే తెలంగాణ నేలకు వందనం’ అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కొనియాడారు. ఏపీలోని పీఠాపురం శివారు చిత్రా  ‘జనసేన  జయకేతనం’ పేరుతో శుక్రవారం రాత్రి నిర్వహించిన జనసేన పార్టీ ఆవి  సభలో ఆయన మాట్లాడారు.

‘రుద్రవీణ వాయిస్తా.. అగ్నిధారలు కురిపిస్తా.. తిరుగుబాటు జెండా పట్టిస్తా.. దుష్టపాలన నుంచి విముక్తి కలిగిస్తా’, ‘భరతభూమి నేర్పినదో.. ప్రజాకోటి నేర్పినదో.. నిజం ఏమిటో తెలియదు గానీ, వట్టి చేత్తో శత్రువుపై దూకే శక్తి ఉంది..’, ‘మూగబోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించి.. కదిలి జవమ్ము కూ  నా కళానికి బలమిచ్చి నడిపించినట్టి.. నా తెలంగాణ.. కోటి రతనాల వీణ..’ అంటూ దాశరథి కృష్ణమాచార్యుల కవితలను పవన్‌కల్యాణ్ ఉటంకించారు.

ఒకప్పుడు కరెంట్ షాక్ తగిలి మృత్యుశయ్యపై ఉన్న నన్ను కొండగట్టు అంజనేయుడు కాపాడాడని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ అన్నాదమ్ములు ప్రేమన పంచి తనకు పునర్జన్మ  కొనియాడారు.

‘బండెనక బండి కట్టి.. పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో పోతవ్ కొడుకో నైజాము సర్కరోడా’ అంటూ  తెలంగాణ సాయుధ పోరాట సమయంలో ఎలుగెత్తి పాడిన బండి యాదగిరిని గుర్తుచేసుకుంటూ, ఆ పాట పాడుతూ  ఉర్రూత  ‘ఖుషి’ సినిమా చూసి ప్రజాయుద్ధనౌక గద్దర్ తనను ఎంతో ప్రోత్సహించారని, తనపై గద్దర్ ప్రభావం ఉందని స్పష్టం చేశారు.

అనంతరం గద్దర్‌కు నివాళులర్పించారు. జనసేన పార్టీ మహిళా నేతలను తనకు రాణీరుద్రమాదేవులుగా కనిపిస్తారని కాకతీయ సామ్రాజ్యాధీశురాలిని గుర్తుచేసుకున్నారు.