- నేడు ఉదయం ౬.౨౩ గంటలకు ప్రయోగం
జీఎస్‌ఎల్వీ రాకెట్ ద్వారా నింగిలోకి ఎన్వీఎస్ ఉపగ్రహం
ఇస్రో కొత్త చైర్మన్ నారాయణన్‌కు తొలి మిషన్
న్యూఢిల్లీ, జనవరి 28: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) 100వ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. బుధవారం జరగ నున్న ఈ ప్రయోగానికి ఇస్రో కౌంట్‌డౌన్ ప్రారంభించింది. ఇస్రో చైర్మన్‌గా సోమనాథ్ స్థానంలో నారాయణన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే తొలి మిషన్ కావడం విశేషం.
ఈ ప్రయోగంలో జీఎస్‌ఎల్వీ రాకెట్ ద్వారా నావిగేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. బుధవారం శ్రీహరికోటలో ఉద యం 6.23 గంటలకు నావిగేషన్ ఉపగ్రహం ఎన్వీఎస్ జీఎస్‌ఎల్వీ ఎఫ్ 15(జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్) రాకెట్ ద్వారా నింగిలోకి ప్రయోగిం చనున్నారు.
ఉపగ్రహం బరువు 2,250 కిలోలు..
యూఆర్ శాటిలైట్ సెంటర్ డిజైన్ చేసి అభివృద్ధి చేసిన ఎన్వీఎస్ ఉపగ్రహం బరువు 2,250 కిలోలు. ఇది ఎల్ 1, ఎల్ 5, ఎస్ బ్యాండ్లలో నావిగేషన్ పేలోడ్‌ను కలిగి ఉంది. అలాగే ఎన్వీఎస్ మాదిరిగా సీ బ్యాండ్‌లో కూడా పేలోడ్‌ను కలిగి ఉంది.
టెరెస్ట్రియల్, ఏరియల్, మారిటైమ్ నావిగేషన్, కచ్చితమైన వ్యవసాయం, ఫ్లీట్ మేనే జ్‌మెంట్, మొబైల్ డివైజ్‌లలో లొకేషన్ బేస్డ్ సర్వీసెస్, శాటిలైట్ల కక్ష్య నిర్ధారణ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత అప్లికేషన్లు, ఎమర్జెన్సీ, టైమింగ్ సర్వీసెస్ కోసం.
ఈ ఉపగ్రహాన్ని ఉపయోగించనున్నట్లు ఇస్రో తెలిపింది. కాగా జీఎస్‌ఎల్వీ రాకెట్ 17వది. పూర్తి స్వదేశీ క్రయో స్టేజ్‌తో కూడిన 11వ రాకెట్.
తనతో తనకే పోటీ..
మొన్నటి వరకు విదేశాలతో ఇస్రో పోటీ పడేది. ఇప్పుడు తనతో తానే పోటీ పడుతూ స్వదేశీ పరిజ్ఞానాన్ని ఎప్పడికప్పుడు పెంపొందించుకుంటూ అత్యుత్తమ సంస్థగా పేరుతెచ్చుకుంది. తొలి రోజుల్లో సంవత్సరానికి ఒక ప్రయోగాన్ని నిర్వహించడానికి కష్టపడిన ఇస్రో.. ప్రస్తుతం నాలుగు నుంచి పది ప్రయోగాలు చేపట్టే స్థాయికి ఎదిగింది.
రాబోయే రోజుల్లో ఏటా 15 ప్రయోగాలు చేపట్టేలా మౌలికవసతులను ఏర్పాటు చేసుకుంటోంది. ప్రస్తుతం ప్రతిష్ఠాత్మక 100వ ప్రయోగం విజయవంతమైతే ఇస్రో కీర్తి మరింత పెరగనుంది.
ఇస్రో 100వ మిషన్ ప్రత్యేకత..
ఇస్రో తన చరిత్రాత్మక 100వ మిషన్‌లో ప్రయోగిస్తున్న ఎన్వీఎస్ భారత ఉపఖండంలోని వినియోగదారులకు, అలాగే భారత్‌కు 1,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలకు కచ్చితమైన స్థానం, వేగం, సమయాన్ని అందించడానికి ఉద్దేశించిన నావిక్(నావి గేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టాలేషన్) శ్రేణిలో రెండోది.
నావిక్ రెం డోతరం ఉపగ్రహాలను ఐదింటిని కలిగిఉంది. అవి ఎన్వీఎస్. 01/02/03/04/05. వాటి సేవల కొనసాగింపును నిర్ధారించడానికి మెరుగైన ఫీచర్లతో నావిక్ బేస్ లేయర్ కాన్‌స్టాలేషన్‌ను విస్తరించడానికి ఇది ఉద్దేశించబడింది.