20-04-2025 12:00:00 AM
మనం రోజూ తినే ఆహార పదార్థాలు, కూరలు, ఇతర వంటకాలు రుచిగా ఉండాలంటే వాటిలో ఉప్పు తప్పనిసరిగా ఉండాలి. ఉప్పు పరిమాణం వాటిలో ఎక్కువైనా, తక్కువైనా వంటకం రుచి పాడవుతుంది. సరిపడినంత ఉప్పును తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్ని లాభాలు ఉన్నాయో చూద్దాం..
పరిమితికి మించి ఉప్పు తీసుకుంటే అంతకంటే ఎక్కువ అనర్థాలు ఉన్నాయి. అందుకే ఉప్పును అవసరాన్ని బట్టి రుచికోసం పరిమితంగానే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉప్పు మన నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కండరాల సంకోచం, వ్యాకోచం చెందేందుకు ఉప్పు అవసరమే. ఉప్పులోని అయోడిన్ థైరాయిడ్ గ్రంథి పనితీరుకు మేలు చేస్తుంది. శరీరంలో సోడియం స్థాయిలు తగ్గితే లోబీపీ వచ్చి రక్తప్రసరణ తగ్గిపోతుంది. అందు కే ఉప్పును తగిన పరిమాణం లో తీసుకోవాలి. అదే ఉప్పు ను ఎక్కువగా తీసుకుంటే హై బీపీ సమస్య పెరగడంతో పాటు కిడ్నీలపై భారం పెరిగి కిడ్నీల ఫెయిల్యూర్‌కు కారణ మయ్యే అవకాశం ఉంది.