calender_icon.png 24 February, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హాలీవుడ్ చిత్రంలో ఆటోవాలాగా..

22-02-2025 12:00:00 AM

సల్మాన్ ఖాన్ హాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం సౌదీ అరేబియాలో జరుగుతోంది. సల్మాన్ షూట్ లో జాయిన్ అయినట్టు సోషల్ మీడియా వేదికగా కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ‘సెవెన్ డాగ్స్’ అనే అర్జెంటీనా మూవీని హాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. ఈ అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కోసం మేకర్స్ సల్మాన్‌ను సంప్రదించారట. దీనికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. తాజాగా షూటింగ్‌లో సైతం జాయిన్ అయ్యాడు.

దు బాయ్‌లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో సంజయ్ దత్ కూడా నటిస్తున్నాడు. సల్మాన్, సంజయ్ దత్‌కు సంబంధించిన సన్నివేశాలపై చిత్రీకరణ జరుగుతోందంటూ కొన్ని వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో సల్మాన్ ఆటో డ్రైవర్‌గా కనిపిస్తున్నాడు. సంజయ్ దత్ సూటూ, బూటులో స్టులిష్‌గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘సికిందర్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. రష్మికా మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఏఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు.