భవంతి చుట్టూ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్
మంబై, జనవరి 7: బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ తన ఇంటికి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు, ఇంటి చుట్టూ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. సల్మాన్ కృష్ణ జిం కను వేటాడినందుకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆయన్ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. తాము దైవంగా భావించే కృష్ణ జింకను వేటాడడాన్ని బిష్ణోయ్ గ్యాంగ్ జీర్ణించుకోలేదు.
దీం తో ఆ గ్యాంగ్ ఇప్పటికే అనేకసార్లు సల్మాన్‌ను మట్టుపెట్టేందుకు యత్నించి విఫలమైంది. దీం తో సల్మాన్ ప్రస్తుతం బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే ప్రయాణిస్తున్నారు. ఫుల్ సెక్యూరిటీతో షూటింగ్‌లు, బయట కార్యక్రమాలకు హాజరవుతున్నారు. తాజాగా ముంబైలోని ఆయన భవంతికి సైతం బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు అమర్చడం చర్చనీయాంశమైంది.