calender_icon.png 26 December, 2024 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిగ్‌బాస్ షూటింగ్‌కు సల్మాన్

19-10-2024 02:25:37 AM

వీకెండ్ షో చిత్రీకరణలో పాల్గొన్న నటుడు

60 మందితో భద్రత 

ముంబై, అక్టోబర్ 18: బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తీవ్రమైన బెదిరింపులు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ గురువారం రాత్రి బిగ్‌బాస్ షో 18వ సీజన్ షూటింగ్ సెట్‌కు వచ్చారు. ఈ నేపథ్యంలో సల్మాన్‌కు పటిష్ఠమైన భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 60 మంది గార్డులతో ఆయనకు భద్రత కల్పించారు. శుక్రవారం కూడా షూటింగ్ ఉండటం తో భద్రత నిమిత్తం సెట్‌లోనే ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక గదిలో ఆయన బస చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఆధార్ కార్డు, ఐడీ కార్డు వంటి ధ్రువీకరణ లేకుండా బయటి వ్యక్తులకు షూటింగ్‌స్పాట్‌లోకి ప్రవేశం నిలిపివేశారు. వీకెండ్ ఎపిసోడ్ షూట్ ముగిసే వరకు బిగ్‌బాస్ సిబ్బంది కూడా అక్కడే ఉండాలని యాజమాన్యం స్పష్టం చేసింది.