తమిళ దర్శకుడు అట్లీ ‘జవాన్’ చిత్రంతో బాలీవుడ్ బాట పట్టి అక్కడ విజయకేతనం ఎగురవేశాడు. ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో తన తర్వాతి సినిమా మల్టీస్టారర్‌గా ఉండవచ్చని అప్పట్లో సంకేతాలు ఇచ్చాడు. త్వరలో ఇది వాస్తవం కానుందని తమి ళ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల తాను సిద్ధం చేసిన కథను సల్మాన్‌కి వినిపించారట అట్లీ. అది ఆయనకి నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశారట. సల్మాన్ కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమాలో మరో ప్రధాన పాత్ర కోసం రజనీకాంత్‌ని సంప్రదించనున్నారట దర్శకుడు.
ఆయన అంగీకరిస్తే ఈ ఇద్దరి సూపర్‌స్టార్స్‌ని ఒకే తెరపై చూడవచ్చు. అయితే ‘వేట్టయాన్’గా ఈ ఏడు తెరమీదికి రానున్న రజనీ, ప్రస్తుతం లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ‘కూలీ’తో పాటు ‘జైలర్ 2’ సినిమా కూడా చేయాల్సి వుంది. ఈ నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసు కుంటారన్నది ఆసక్తికరంగా మారిందిప్పుడు. ఇప్పటికే తమిళ దర్శకుడైన మురుగదాస్‌తో సల్మాన్ ‘సికందర్’ చిత్రా న్ని పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే.