- హైదరాబాద్‌లో 44 శాతం వృద్ధి
- సీబీఆర్‌ఈ రిపోర్ట్
న్యూఢిల్లీ, జూలై 18: దేశంలో లగ్జరీ ఇండ్ల అమ్మకాలు జోరందుకుంటున్నాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ ఈ తాజా నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది జనవరి మధ్యకాలంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో రూ.4 కోట్లు పైబడి విలువైన లగ్జరీ ఇండ్ల అమ్మకాలు 27 శాతం వృద్ధితో 8,500 యూని ట్లకు చేరాయని తెలిపింది. గత ఏడాది ఇదేకాలంలో 6,700 లగ్జరీ గృహాలు అమ్ముడయ్యాయని పేర్కొంది. లగ్జరీ ఇండ్ల అమ్మకాల్లో ప్రధాన మార్కెట్లయిన ఢిల్లీఎన్సీఆర్, ముంబై, హైదరాబాద్‌ల వాటా 84 శాతం వరకూ నమోదయ్యిందని సీబీఆర్‌ఈ వివరించింది.
హైదరాబాద్ నగరంలో లగ్జరీ ఇండ్ల అమ్మకాలు ఈ జనవరి మధ్యకాలంలో 44 శాతం వృద్ధితో 1,300 యూనిట్లకు పెరిగాయి. ఢిల్లీ ఎన్సీఆర్‌లో 14 శాతం పెరిగి 3,300 యూనిట్లకు చేరగా, ముంబైలో అంతేశాతం వృద్ధిచెంది 2,500 యూనిట్ల వద్ద నిలిచాయి. బెంగళూరులో మాత్రం లగ్జరీ ఇండ్ల విభాగంలో ఈ ఏడాది ప్రధమార్థంలో అమ్మకాలు నమోదుకాలేదని సీబీఆర్‌ఈ తెలిపింది. పూనేలో ఈ అమ్మకాలు ఆరు రెట్లు వృద్ధిచెంది 1,100 యూనిట్లకు చేరాయన్నది.