సాలెగూడ : పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే హద్దులు మీరి రేచ్చిపోయారు. దీంతో ఆ పాఠశాల బంద్ అయింది. ఈ ఘటన ఆసిఫాబాద్ జిల్లా సాలెగూడ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలో ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య ఘర్షణ జరిగింది. పిల్లల ముందే బూతు పదాలతో గొడవ పడ్డారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు ఉపాధ్యాయులని అడ్డుకున్న ఉపాధ్యాయులు వినకపోవడంతో గ్రామస్తులు పాఠశాలకి తాళం వేశారు. విషయం తెలిసిన ఎంఈఓ వెంటనే పాఠశాలకు వెళ్లి గ్రామస్తులతో సమస్యపై విచారణ జరుపుతున్నారు.