calender_icon.png 2 October, 2024 | 3:49 PM

గాంధీ జయంతి రోజు మటన్, చికెన్ అమ్మకాలు

02-10-2024 12:19:30 PM

పెద్దరా అమావాస్య కావడంతోనే అమ్మకాలు చేపట్టామని అంటున్న వ్యాపారులు

మీడియా వెళ్లడంతో దుకాణాలను మూసిన వ్యాపారు లు

మున్సిపల్ అధికారుల ఆదేశాలు బే ఖతార్

కామారెడ్డి, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రం తో పాటు మరికొన్ని మండలాల్లో గాంధీ జయంతి రోజు దర్జాగా చికెన్, మటన్ వ్యాపారులు అమ్మకాలు చేపట్టారు. బుధవారం పెద్ద అమావాస్య కావడంతో పూర్వం నుంచి వస్తున్న ఆచారం లో భాగంగా ఇంటి పెద్దలకు నైవేద్యం పెట్టేందుకు మటన్ ను పేద ,మధ్యతరగతి, ఉన్నత వర్గాలు  ప్రజలు కూడా మటన్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. గాంధీ జయంతి రావడంతో చికెన్ మటన్ అమ్మకాలు చేపట్టవద్దని మున్సిపల్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. చికెన్, మటన్ వ్యాపారులు మాత్రం మున్సిపల్ అధికారుల ఆదేశాలను ఖతార్ చేయలేదు. బహిరంగంగా రోడ్లపై మటన్ దుకాణాలను పెట్టి అమ్మకాలు సాగించిన అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడలేదు.

వ్యాపారుల వద్ద మామూలు దండుకున్న మునిసిపల్ అధికారులు దుకాణాలు తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గాంధీ జయంతి రోజు దర్జాగా మటన్, చికెన్ అమ్మకాలు సాగిస్తున్న తీరును మీడియా ప్రతినిధులు వెళ్లి ఫోటోలు కెమెరాలు పెట్టడంతో వ్యాపారులు ఆధార బదరగా మూసి ఉంచి అందులోనే అమ్మకాలు చేపట్టారు. పైకి డోలు బంద్ చేసి లోపల అమ్మకాలు చేశారు. దుకాణం బయట ఒకరు ఉండి కొనుగోలుదారుల వద్ద డబ్బులు తీసుకొని వారి వద్దకే మటన్ చికెన్ లను అందించారు మరికొందరికి ఇంటివద్ద కు పార్సిల్ తీసుకెళ్లి అందించారు డబ్బులు కూడా ఫోన్ పే గూగుల్ పే ద్వారా డబ్బులు కూడా ఫోన్ పే గూగుల్ పే ద్వారా చెల్లించారు.

గతంలో ఎప్పుడూ కూడా గాంధీ జయంతి రోజు అమ్మకాలు చేపట్టలేదని ఈసారి పెద్ద లా అమావాస్య రావడం వల్ల అమ్మకాలు చేపట్టినట్లు చికెన్ మటన్ వ్యాపారాలు పేర్కొన్నారు. మంగళవారం రోజు అర్ధరాత్రి వరకు కూడా అమ్మకాలు చేపట్టిన కొందరు కొనుగోలుదారులు రాకపోవడంతో పాటు బుధవారం రోజు కొనుగోలు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రం తో పాటు దేవునిపల్లి వద్ద జీవధాన్ ఆసుపత్రి దాటిన తర్వాత మటన్ వ్యాపా రూలు రోడ్ల పక్కనే అమ్మకాలు చేపట్టడంతో కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి తాడువాయి లింగంపేట్ వెళ్లే వాహనదారులు రోడ్డు జామ్ కావడంతో ఇబ్బందులు పడ్డారు. మటన్ చికెన్ కొనుగోలుదారులతో మటన్ మార్కెట్ సందడిగా మారింది.