నాగర్ కర్నూల్: జిల్లాలో అడవి జంతువు మాంసాన్ని విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. అమ్రాబాద్ మండలం వంగురోనిపల్లి గ్రామానికి చెందిన సాయిలు, జక్క నరసింహారావు, కడారి అంజయ్యలు ఆగస్టు 12వ తేదీన గ్రామ సమీపంలోని ఒక పంట పొలంలో విద్యుత్ షాక్ తగిలి అడవి బంతువు కణితి మృతి చెందంది. కణితి జంతు మాంసాన్ని ఇతరులకు విక్రయిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు సమాచారం అందుకున్నారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎఫ్ఆర్ఓ గురు ప్రసాద్ తెలిపారు.