calender_icon.png 24 November, 2024 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయుర్వేదం పేరిట నకిలీ ఔషధాల విక్రయం

24-11-2024 02:48:16 AM

రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్  కంట్రోల్ అధికారుల దాడులు

హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. పలుచోట్ల ఆయుర్వేదం పేరిట నకిలీ ఔషధాలను విక్రయిస్తున్న వారిని డ్రగ్ కంట్రోల్ అధికారులు శనివారం అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. ఊబకాయా న్ని  తగ్గించేందుకు, నరాల బలహీనతకు, కిడ్నీలో రాళ్ల చికిత్సకు ఆయుర్వేదం పేరిట షాద్‌నగర్, భైంసా, ఆదిలాబాద్ జిల్లాలోని సుంకిడి, నాగర్‌కర్నూల్‌లో విక్రయిస్తున్న నకిలీ మందులను డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మందు లను మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్‌తోపాటు ఐడీఏ బొల్లారంలో తయారుచేసి నట్లు గుర్తించారు. 

నకిలీ వైద్యుడిపై కేసు..

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం, కాకరవాయి గ్రామంలో ఎలాంటి అర్హతలు లేకుండా వైద్యం చేస్తున్న పరాల అంజయ్య క్లినిక్‌పై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడి చేశారు. డ్రగ్ లైసెన్స్ లేకుండానే నిల్వ చేసి విక్రయిస్తున్న యాంటిబయోటిక్స్, స్టెరా యిడ్స్, నొప్పి నివారణ మందులను స్వాధీనం చేసుకున్నారు.