ముగ్గురు అరెస్టు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 2 (విజయక్రాంతి): సరదా కోసం డ్రగ్స్‌కు అలవాటుపడిన ముగ్గురు యువకులు ఆ తర్వా త బానిసలుగా మారారు. వారి అవసరాలకు కావాల్సిన డబ్బుల కోసం డ్రగ్స్ విక్రేత లుగా అవతారమెత్తారు. అందుకోసం వారు ండే హాస్టల్‌నే కేంద్రంగా చేసుకొని అమ్మకాలు సాగించారు. చివరకు ఎక్సైజ్ పోలీసు లకు పట్టుబడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలను నాంపల్లిలోని ఆబ్కారీ భవన్‌లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి వెల్లడించారు. ఎస్‌ఆర్ నగర్‌లోని వెంకట్ బాయ్స్ హాస్టల్‌లో డ్రగ్స్ విక్రేతలున్నట్లు ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందడంతో శుక్రవారం ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రదీప్‌రావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో రూ.12 లక్షల విలువైన 115 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, 250 గ్రాముల గంజాయిని గుర్తించారు. ఏపీలోని చిత్తూరుకు చెందిన రవూఫ్, కడపకు చెందిన మోహిత్‌రావు, యజ్ఞదత్తు అనే ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఎంఏ రవూఫ్, మోహిత్‌లు బెంగళూరులో చదువుకున్నారని, రవూఫ్ బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ను సప్లు చేస్తూ ఇక్కడ పలువురికి విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. అతనికి నైజీరియాకు చెందిన నెగ్గిన్ అనే డ్రగ్స్ విక్రేతతోనూ సంబంధాలున్నట్లు గుర్తించారు. నెగ్గిన్ ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమ లాసన్ రెడ్డి తెలిపారు.