నల్లగొండలోని దుకాణాల్లో ఐపీ, కాపీరైట్స్ అధికారుల దాడులు
నల్లగొండ, జూలై 24 (విజయక్రాంతి)-: నల్లగొండ ప్రకాశం బజార్ లోని పలు దుకాణాల్లో బ్రాండ్ల పేరు తో నకిలీ వస్తువులు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో బుధవారం ఐపీ (ఇంటెలెక్టువల్ ప్రాపర్టీ) ముంబై అధికారులు, కాపీరైట్స్ అధికారు లు.. స్థానిక పోలీసులతో కలిసి తనిఖీలు చేశారు. హనుమాన్ ఎలక్ట్రికల్ షాపు నిర్వాహకులు గోల్డ్ మెడల్ బ్యాండ్ పేరుతో నకిలీవి . పద్మావతి కిరాణ దుకాణంలో స్లీప్‌వెల్ కంపెనీ పేరుతో నకిలీ మస్కిటో స్టిక్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
ఎలక్ట్రికల్ దు కాణంలో రూ. 22 లక్షల విలువైన విద్యుత్ తీగల బండెళ్లను, కిరాణ షాపులో రూ.లక్షా 20వేలకు పైగా విలువైన మస్కిటో స్టిక్స్‌ను స్వాధీనం చేసుకొని వన్‌టౌన్ పోలీస్ స్టేసన్‌కు తరలించారు. బ్రాండ్ల పేరుతో నాణ్యత లేని వస్తువులు విక్రయిస్తున్న వ్యాపారులు మదన్, శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నామని వన్‌టౌన్ సీఐ ఎమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. తనిఖీ ల్లో ఐపీ దర్యాప్తు అధికారి ఇజ్రార్, ఎస్‌ఐలు సందీప్‌రెడ్డి, శంకర్, కాపీరైట్స్ అధికారులు ఇక్బాల్ ఖాద్రీ, దినే ష్ శెట్టి, సంతోష్, దీపక్ పాల్గొన్నారు.