calender_icon.png 15 November, 2024 | 12:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హింద్ జింక్‌లో కేంద్రం వాటా విక్రయం

06-11-2024 12:00:00 AM

  1. నేడు, రేపు ఓఎఫ్‌ఎస్
  2. రూ.5,000 కోట్ల సమీకరణ లక్ష్యం

న్యూఢిల్లీ, నవంబర్ 5: దేశంలో వెండి, జింక్ ఉత్పత్తి చేసే హిందుస్థాన్ జింక్‌లో కేంద్ర ప్రభుత్వం తనకున్న వాటాలో 2.5 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) మార్గంలో బుధ, గురువారాల్లో విక్రయించనుంది. ఈ ఓఎఫ్‌ఎస్‌కు ఒక్కో షేరుకు రూ. 505 ఫ్లోర్ ధరను నిర్ణయించింది.

ఫ్లోర్ ధరపై వాటా విక్రయం పూర్తయితే కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రూ. 5,000 కోట్లు సమకూరుతుంది. నవంబర్ 6, బుధవారం సంస్థాగత బిడ్డర్లు, నవంబర్ 7, గురువారం రిటైల్ ఇన్వెస్టర్లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని దీపం కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే ఎక్స్‌లో పోస్టు చేశారు. హింద్ జింక్ షేరు మంగళవారం నాటి ధర రూ. 559తో పోలిస్తే 9.7 శాతం డిస్కౌంట్‌తో ప్రభుత్వం ఫ్లోర్ ధరను నిర్ణయించింది.