calender_icon.png 19 April, 2025 | 7:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాలరీ కుంభకోణం.. ఊడిన తెలుగు వారి ఉద్యోగాలు

17-04-2025 01:51:10 AM

  1. 700 మంది ఉద్యోగులను తొలగించిన అమెరికా కంపెనీ

అత్యధికులు తెలుగువారే

వాషింగ్టన్, ఏప్రిల్ 16: అమెరికన్ కంపెనీ ‘ఫ్యానీ మే’ ఇటీవల 700 మంది ఉద్యోగులను తొలగించింది. 200 మందిని నైతిక కారణాలతో తొలగించినట్టు కంపెనీ పేర్కొంది. ఇందులో అత్యధికులు తెలుగువారే ఉన్నట్టు తెలుస్తోంది. మ్యాచింగ్ గ్రాంట్స్ ప్రోగ్రామ్‌లో అవకతవకలకు పాల్పడటంతో పాటు నిధుల దుర్వినియోగానికి కూడా వీరు పాల్పడినట్టు కంపెనీ అభియోగాలు మోపినట్టు తెలుస్తోంది.

తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా)తో కలిసి వీరు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు కంపెనీ ఆరోపించింది. కేవలం తానాతోనే కాకుండా మరిన్ని సంస్థలతో కూడా కుమ్మక్కైనట్టు వీరిపై ఆరోపణలున్నాయి. గతంలో టెక్ జెయింట్ యాపిల్ కంపెనీ కూడా ఇదే విధంగా ఉద్యోగులను తొలగించింది.