20-03-2025 12:17:27 AM
అమెరికాలో మెరిసిన దివేశ్
ఎల్బీనగర్, మార్చి 20: అమెరికాలో ఎల్బీనగర్‌కు చెందిన యువకుడు ఏకంగా రూ.3 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. ఎల్బీనగర్‌లోని చిత్ర లేఅవుట్‌లో నివసిస్తున్న గూడె సాయిదివేశ్ చౌదరి అమెరికాలోని ప్రముఖ చిఫ్ తయారీ కంపెనీ ఎన్వీడియాలో వార్షిక వేతనంగా రూ.3 కోట్ల వేతనంతో ఉద్యోగం సాధించాడు. దివేశ్ తండ్రి కృష్ణమోహన్ రియల్ ఎస్టేల్ వ్యాపారి.
తల్లి ప్రముఖ విద్యాసంస్థ రమాదేవి పబ్లిక్ స్కూల్‌లో పదేండ్ల పాటు టీచర్‌గా పని చేసింది. దివేశ్ 5 నుంచి 10వ తరగతి వరకు రమాదేవి పబ్లిక్ స్కూల్‌లో చదివాడు. ఇంటర్‌లో మంచి మార్కులు సాధించి, కురుక్షేత్రలోని ఎన్‌ఐటీలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు. అక్కడే న్యూటానిక్స్ కంపెనీలో రూ.40 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు.
అనంతరం లాస్‌ఏంజెల్స్‌లోని యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో క్లౌడ్, ఏఐ టెక్నాలజీలో ఎంఎస్ పూర్తి చేశాడు. అక్కడే ఎన్వీడియా కంపెనీలో డెవలప్‌మెంట్ ఇంజినీర్‌గా రూ.3 కోట్ల వార్షిక వేతనానికి ఉద్యోగం సాధించాడు. డిజిటల్ ప్రపంచానికి అనుగుణంగా తన కలల్ని నెరవేర్చేకునే దిశగా దివేశ్ చౌదరి ప్రయాణం నేటి యువతకు స్ఫూర్తిదాయకం.