మాధబి పురీపై కాంగ్రెస్ ధ్వజం
న్యూఢిల్లీ: సెబీ చీప్ మాధబి పురీపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. సెబీ చైర్‌పర్సన్‌గా ఉంటూ.. ఆమె ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి వేతనం తీసుకుంటున్నారంటూ ఆరోపించింది. ఈ మేరకు ఆ పార్టీ నేత పవన్ ఖేడా సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఇది పరస్పర విరుద్ధ ప్రయోజనాలకిందకే వస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఇది ప్రజా సేవల్లో నైతికత, జవాబుదారీతనాన్ని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు.
ఒక కంపెనీలో పనిచేస్తూ ఒకచోట మాత్రమే వేతనం తీసుకోవాల్సి ఉంటుందని పవన్ అన్నారు. అలాంటిది సెబీ చీఫ్ విషయంలో అలా జరగడం లేదన్నారు. సెబీ పూర్తికాల సభ్యురాలిగా ఉన్న మాధబి ఐసీఐసీఐ బ్యాంక్, ్రప్రుడెన్షియల్ నుంచి వేతనం అందుకుంటున్నారని ఆరోపించారు. 2017- 2024 మధ్య ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్లు కూడా అందుకున్నారని పేర్కొన్నారు. ఒక అత్యున్నత నియంత్రణ సంస్థను నడిపిస్తున్న వ్యక్తులు ఇలా వేతనం అందుకోవడం సెబీ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.
2017 నుంచి సెబీ సభ్యురాలిగా ఉన్న బుచ్.. 2022లో చైర్‌పర్సన్ అయ్యారని పవన్ వెల్లడించారు. గత ఏడేళ్ల కాలంలో ఆమె సుమారు రూ. 16 కోట్లకు పైగా వేతనం అందుకున్నారని ఆరోపించారు. సెబీ చీప్‌గా ఉం టూ ఐసీఐసీఐ నుంచి వేతనం ఎందు కు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై బయటి వ్యక్తుల ప్రభావం పడకుండా పారదర్శకంగా విచారణ జరిపించాలని కోరారు. వేత నం అందుతుండడం వల్లే ఐసీఐసీఐ బ్యాంక్‌పై పలు విచారణలు నిలిచిపోయాయని ఆరోపించారు. సెబీ చీఫ్ నియామకంలో కీలకమైన కేబినెట్ అపాయింట్ మెంట్ కమిటీలో కీలక వ్యక్తులైన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను పవన్ ఖేడా తప్పుబట్టారు.