calender_icon.png 28 October, 2024 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త టీచర్లకు ఈనెల 10 నుంచే జీతాలు

27-10-2024 12:00:00 AM

స్పష్టతనిచ్చిన విద్యాశాఖ

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): ఇటీవల డీఎసీెే్స2024 ద్వారా నియమితులైన కొత్త టీచర్ల జీతాలపై పాఠశాల విద్యాశాఖ స్పష్టతనిచ్చింది. ఈమేరకు శనివారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈవీ నర్సింహారెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఈనెల 10వ తేదీ నుంచే జీతాలు చెల్లిస్తామని తెలిపారు.

కొత్త టీచర్లకు నియామకపత్రాలు ఈనెల 9వ తేదీ న ఎల్బీస్టేడియంలో అందించామని, ఈనెల 10, 11వ తేదీల్లో జిల్లాల విద్యాశాఖ కార్యాలయాల్లో అభ్యర్థు లు రిపోర్ట్ చేయడంతో ఈనెల 10వ తేదీ నుంచే వారికి వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసు కుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈనెల 10వ తేదీతోనే 10 వేల మంది టీచర్లకు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చారు.

అయితే వీరిలో కొంతమంది ఈనెల 15న, 17వ తేదీల్లో పాఠశాలల్లో చేరారు. అపాయింట్‌మెంట్ ఆర్డర్, జాయినింగ్ డేట్లు వేర్వేరుగా ఉన్నాయి. ఈక్రమంలో అసలు తమకు వేతనం ఏ తేదీ నుంచి వస్తుందని కొత్తగా ఎంపికైన టీచర్లు  యోచిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఈనెల 10వ తేదీ నుంచే ఇస్తామని పేర్కొంది. తాజాగా ఈ విషయమై విద్యాశాఖ స్పష్టతనిచ్చింది.