09-02-2025 01:08:10 AM
సంక్షేమ శాఖ కార్యాలయ సిబ్బందిపై కలెక్టర్ చర్యలు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): అనుమతి లేకుండా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులు శుక్రవారం ఆఫీసు విడిచి వెళ్లిన ఘటనపై హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సీరియస్ అయ్యారు. 14 మంది సిబ్బందిపై సీసీఏ రూల్స్ ప్రకారం శనివారం క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు.
ఆఫీసులోని అటెండెన్స్‌లో సంతకం చేసి అనుమతి లేకుండా బయటకు వెళ్లిన వారికి ఒకరోజు వేతనం నిలుపుదలతో పాటు వారి సర్వీస్‌ను కౌంట్(డైస్‌పూన్) చేయొద్దని ఎఫ్‌ఆర్18 ప్రకారం కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
శుక్రవారం స్త్రీ, శిశు సం క్షేమ శాఖ జిల్లా కార్యాలయంలో పని చేస్తు న్న సిబ్బంది లేకపోవడంతో ‘సార్ ఇంట్లో వేడుక.. సంక్షేమ కార్యాలయం వెలవెల’ అనే పేరిట విజయక్రాంతి దినపత్రికలో కథనం విచ్చిన విషయం తెలిసిందే.