టీఎస్‌టీసీఈఏ అధ్యక్షులు సంతోష్
హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): రాష్ట్రంలోని టెక్నికల్ కాలేజీ ల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని టీఎస్‌టీసీఈఏ అధ్యక్షు డు అయినేని సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. కొన్ని కాలేజీలు నెలల కొద్ది జీతాలు చెల్లించడం లేదని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దసరాలోపు పూర్తి జీతాలు చెల్లించి, ఉద్యోగులకు దసరా సెలవులు ప్రకటించాలని ఆయన కోరారు.