calender_icon.png 20 January, 2025 | 9:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏరియా హాస్పిటల్ శానిటేషన్ కార్మికుల వేతనాలు విడుదల చేయాలి

20-01-2025 06:18:40 PM

సిఐటియు పట్టణ కన్వీనర్ ఎమ్ బి నర్సారెడ్డి...

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్ సెక్యూరిటీ ఇతర విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులు సుమారు 100 మంది కార్మికుల కు గత ఐదు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సోమవారం ఐటిడిఏ ప్రజా దర్బార్ లో పీవో రాహుల్ కి సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ కన్వీనర్ ఎంబి నర్సారెడ్డి మాట్లాడుతూ... ఏరియా హాస్పిటల్ కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతూ అనేకమార్లు సూపర్నెంట్, డిసిహెచ్, పిఓ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరం రోజున అలాగే సంక్రాంతి పండగ సందర్భంగా కూడా వేతనాలు లేక కనీసం పిల్లలకు బట్టలు కొనుక్కొని పండగ జరుపుకునే పరిస్థితి లేకపోయినదని అన్నారు.

కార్మికులు పండగ పూట కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి కాంట్రాక్టర్ కల్పించారని ఆరోపించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గొప్పలు చెబుతూ అన్ని సమస్యలకు మేము పరిష్కారం చేస్తామని అందరి బకాయిలకు మేము డబ్బులు చెల్లిస్తామని బూటకపు వాగ్దానాలు చేస్తూ కార్మికులను మోసం చేస్తుందని ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కార్మికుల వేతనాలు, ఇతర సమస్యలను పరిష్కరించాలని లేనియెడల భవిష్యత్తులో జరిగే పరిణామాలకి ప్రభుత్వం, అధికారుల బాధ్యత వహించాలని హెచ్చరించారు. కార్మికుల వినతి పత్రాన్ని స్వీకరించిన ఐటిడిఏ పిఓ బి రాహుల్ మాట్లాడుతూ... కార్మికుల వేతనాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రస్తుత కాంట్రాక్టు ఏజెన్సీని రద్దుచేసి త్వరలోనే కొత్త వారిని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమస్య పరిష్కారం కాకపోతే దీర్ఘకాలిక సమ్మె చేపడతామని నర్సారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నాగరాజు హాస్పిటల్ యూనియన్ కార్మికులు రమ, వెంకటరమణ, కుమారి, సరిత, మెహబూబ్, రమణ, కుమారిలు పాల్గొన్నారు.

సిఐటియు ఆధ్వర్యంలో ఐటీడీఏ పీవో రాహుల్ కి వినతిపత్రం.....

భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్ సెక్యూరిటీ ఇతర విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులు సుమారు 100 మంది కార్మికులకు గత ఐదు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సోమవారం ఐటిడిఏ ప్రజా దర్బార్ లో పీవో రాహుల్ కి సిఐటియు ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ కన్వీనర్ ఎంబి నర్సారెడ్డి మాట్లాడుతూ... ఏరియా హాస్పిటల్ కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతూ అనేకమార్లు సూపర్నెంట్, డిసిహెచ్, పిఓ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరం రోజున అలాగే సంక్రాంతి పండగ సందర్భంగా కూడా వేతనాలు లేక కనీసం పిల్లలకు బట్టలు కొనుక్కొని పండగ జరుపుకునే పరిస్థితి లేకపోయినదని అన్నారు. కార్మికులు పండగ పూట కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి కాంట్రాక్టర్ కల్పించారని ఆరోపించారు.

అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గొప్పలు చెబుతూ అన్ని సమస్యలకు మేము పరిష్కారం చేస్తామని అందరి బకాయిలకు మేము డబ్బులు చెల్లిస్తామని బూటకపు వాగ్దానాలు చేస్తూ కార్మికులను మోసం చేస్తుందని ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కార్మికుల వేతనాలు, ఇతర సమస్యలను పరిష్కరించాలని లేనియెడల భవిష్యత్తులో జరిగే పరిణామాలకి ప్రభుత్వం, అధికారుల బాధ్యత వహించాలని హెచ్చరించారు. కార్మికుల వినతి పత్రాన్ని స్వీకరించిన ఐటిడిఏ పిఓ బి రాహుల్ మాట్లాడుతూ.. కార్మికుల వేతనాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రస్తుత కాంట్రాక్టు ఏజెన్సీని రద్దుచేసి త్వరలోనే కొత్త వారిని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమస్య పరిష్కారం కాకపోతే దీర్ఘకాలిక సమ్మె చేపడతామని నర్సారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నాగరాజు హాస్పిటల్ యూనియన్ కార్మికులు రమ, వెంకటరమణ, కుమారి, సరిత, మెహబూబ్, రమణ, కుమారిలు పాల్గొన్నారు.