హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించుకుంటున్నా.. మోడల్ స్కూల్ టీచర్లకు ఇంత వరకూ అక్టోబర్ వేతనాలు అందలేదు. రాష్ర్టం వ్యాప్తంగా 194 మోడల్ స్కూల్స్‌లో పనిచేస్తున్న రెగ్యులర్ టీచర్లకు ఒకటో తేదీన వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా సిబిల్ తగ్గిపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్షుడు భూతం యాకమల్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.