హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి): తెలంగాణకు చెందిన నలు గురు విద్యార్థులు జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ జపాన్ సైన్స్ హైస్కూల్ (సకుర) ప్రత్యేక ప్రోగ్రాం నిర్వహించింది. దీనిలో చేవేళ్ల మోడ ల్ స్కూల్‌లో ఇంటర్ సెకండియర్ చదువుతున్న సర్బజిత్, శంకరపట్నం మోడల్ స్కూ ల్ విద్యార్థి నబా మహమ్మదీ, మంచిర్యాల కేజీబీవీలో ఇం టర్ సెకండియర్ చదువుతున్న విద్యాసింగ్, కొత్తపేటలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న భాస్కర్ జిల్లా స్థాయిలో సత్తా చాటారు. అనంతరం రాష్ట్రస్థాయిలోనూ ప్రతిభ చూపారు. నవంబర్ 10 వరకు జపాన్ టూ ర్‌కు వెళ్లనున్నారు. నలుగురు విద్యార్థులను మంగళవారం పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి అభినందించారు.