ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన సజ్జనార్
హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): డిజిటల్ మోసాలపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇటీవల పోస్ట్ చేసిన వీడియో ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించింది. ఆదివారం మన్‌కీబాత్‌లో మోదీ డిజిటల్ మోసాలపై చర్చించారు. ఒక వ్యక్తి నకిలీ పోలీసు అధికా రులతో మాట్లాడుతున్న వీడియోను పంచుకున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చు లో పడకుండా ఈ వ్యక్తి తెలివిగా ఎలా తప్పించుకున్నాడో వివరించారు.
కర్ణాటక విజయపూర్ చెందిన సందీప్ పాటిల్.. నకిలీ పోలీస్‌తో చేస్తోన్న సంభాషణను సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో సెప్టెంబర్ 19న పోస్ట్ చేశారు. ఆ ట్వీట్ ఆధారంగా మోదీ పాటిల్ గురించి మాట్లాడారు. పాటిల్ ధైర్యాన్ని మొచ్చుకున్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాల నియంత్రణకు అవగాహన కల్పించేందుకు ప్రధానమంత్రి ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చినందుకు సజ్జనార్ ధన్యవాదాలు తెలిపారు.