26-04-2025 11:00:00 AM
ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరొకరు అరెస్ట్
ఏ6గా ఉన్న సజ్జల శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్ సిట్
హైదరాబాద్ నుంచి విజయవాడకు సజ్జల శ్రీధర్‌రెడ్డి తరలింపు.
నేడు ఏసీబీ కోర్టులో శ్రీధర్‌రెడ్డిని హాజరుపర్చనున్న సిట్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం(Andhra Pradesh Liquor Scam Case) కేసుకు సంబంధించి మరో కీలక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆరో నిందితుడు, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి(Sajjala Sridhar Reddy)ని నిన్న సాయంత్రం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనను విజయవాడకు తరలించారు. నిందితుడిని నేడు అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. ఇటీవల ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
న్యాయమూర్తి రిమాండ్ ఆదేశాల మేరకు కేసిరెడ్డిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) పాలనలో మద్యం అమ్మకం, కొనుగోలులో రూ.3,200 కోట్ల కుంభకోణం జరిగిందని సిట్ అధికారులు నిర్ధారించారు. ఇటీవలి లోక్‌సభ సమావేశంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు లావు శ్రీ కృష్ణదేవరాయలు మద్యం కుంభకోణంపై కేంద్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేశారు. సంబంధిత సమాచారాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సమర్పించారు. ఈ నేపథ్యంలో నేర పరిశోధన విభాగం (సిఐడి) నిందితుల అరెస్టుపై దృష్టి సారించి, దర్యాప్తును ముమ్మరం చేసింది.