సింగరేణి అర్జీ -2లో ఘోర ఘటన..
రామగుండం (విజయక్రాంతి): సింగరేణి రామగుండం -2 లో మంగళవారం ఘోర ఘటన సంభవించింది. గతంలో మూసివేసిన జీడికే -7 ఎల్ ఈ పీ గని వద్ద ఇసుక బంకర్ కూలిన ఘటనలో హెడ్ ఓవర్ మెన్ సత్యనారాయణ సజీవ సమాధి అయ్యాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.