calender_icon.png 10 October, 2024 | 1:53 AM

సైనీనే హర్యానా సీఎం!

09-10-2024 01:00:31 AM

చండీగఢ్, అక్టోబర్ 8: హర్యానాలో వరుసగా మూడోసారి బీజేపీ ఘన విజయం సాధించటంతో ప్రస్తుత సీఎం నాయబ్ సింగ్ సైనీనే కొనసాగిస్తారా? లేదంటే కొత్త వ్యక్తికి అధికారం కట్టబెడుతారా? అనే చర్చ మొదలైంది. సీఎం పోస్టు కోసం పార్టీలో చాలామందే ఎదురుచూస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో అప్ప టి సీఎం మనో హర్‌లాల్ ఖట్టర్ త న పదవికి రాజీనామా చేసి లోక్‌సభకు పోటీచేసి కేంద్ర మంత్రి అ య్యారు.

ఆయన స్థానంలో సైనీని సీఎంగా నియమించారు. ఆయన ఆ పదవి చేపట్టిన 200 రోజులకే అ సెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. పదేండ్ల పాలనపై ఉన్న వ్యతిరేకతను అధిగమించి పార్టీని రికార్డు స్థాయిలో మూడోసారి అధికారంలోకి తెచ్చా రు.