calender_icon.png 17 October, 2024 | 5:51 PM

హర్యానా సీఎంగా సైనీ

17-10-2024 01:28:30 AM

నేడు ప్రమాణ స్వీకారం

హాజరుకానున్న పీఎం మోదీ, అమిత్ షా

చండీగఢ్, అక్టోబర్ 16: హర్యానా భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష నేతగా( బీజేఎల్పీ) మాజీ సీఎం నాయబ్ సింగ్ సైనీ ఎన్నికయ్యారు. ఈనెల 17న హర్యానా ముఖ్యమంత్రిగా సైనీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ  కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు.

కాగా బుధవారం కేంద్రమంత్రులు అమిత్ షా, మనోహర్ లాల్ ఖట్టర్ ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో సైనీని తమ నేతగా ఎమ్మెల్యే లు ఎన్నుకున్నారు. సైనీ పేరును మనోహర్‌లాల్ ప్రతిపాదించారు.

ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధిం చింది. మొత్తం 90 స్థానాల్లో 48 చోట్ల బీజేపీ అభ్యర్థులను నాయబ్ సింగ్ సైనీ అంతా తానై ఎమ్మెల్యేలుగా గెలిపించారు. అధికారంలోకి వస్తామని ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ను 37 స్థానాలకే పరిమితం చేశారు.