న్యూఢిల్లీ: ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించేవరకు అలాంటి క్రీడ ఉందన్న సంగతి తెలియదని భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. సైనాను టార్గెట్ చేస్తూ ఒక ఆకతాయి ‘కంగనా రనౌత్ ఆఫ్ స్పోర్ట్స్’ అని వ్యంగ్యంగా పోస్టు పెట్టాడు. సైనా ధీటుగా బదులిచ్చింది. ‘కంగనా చాలా బ్యూటిఫుల్. నేను బ్యాడ్మింటన్లో పర్ఫెక్ట్. ఆటలో నేను ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు అందుకున్నా. దేశానికి ఒలింపిక్ పతకం తీసుకొచ్చా. ఇంట్లో కూర్చొని కామెంట్స్ చేయడం తేలికే. కానీ గేమ్ ఆడడమే కష్టం’ అని పేర్కొంది.