26-04-2025 12:00:00 AM
హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను వియవంతం చేయాలని కోరుతూ శేరిలింగంపల్లికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నేత రవీందర్ యాదవ్ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయించారు.
ఒడిశాలోని పూరీ సముద్ర తీరంలో చలో వరంగల్ సభకు సంబంధించిన వివరాలను సైకత శిల్పంలో పేర్కొన్నారు. సైకత శిల్పంలో తెలంగాణ మ్యాప్‌తో పాటుగా అందులో కేసీఆర్ చిత్రాన్ని, 25 ఏళ్ల ప్రస్థానంలో కేసీఆర్ నాయకత్వంలో చేసిన సేవలు, తెలంగాణ ప్రగతిని వివరించారు. ఏప్రిల్ 27న ఎల్కతుర్తి వద్ద నిర్వహించే సభ చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంటికి ఒకరు గులాబీ సైన్యంలా కదలి, తెలంగాణ సత్తా చాటాలని పిలుపునిచ్చారు.