02-02-2025 12:46:03 AM
సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఆయన్ను హీరోగా పరిచయం చేస్తూ నెట్‌ఫ్లిక్స్ కొత్త ప్రాజెక్టును ప్రకటించింది. ఖుషీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ ఓటీటీ చిత్రానికి ‘నాదానియన్’ అనే టైటిల్ ఖరారు చేశారు. షోనా గౌతమ్ దర్శకత్వంలో ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కరణ్ జోహార్, అపూర్వ మెహ్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుంది. కొద్ది రోజు ల క్రితమే ఇబ్రహీంను హీరోగా పరిచయం చేసే విషయంతో పాటు సైఫ్ కుటుంబంతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఆసక్తికర పోస్ట్ ఒకటి పెట్టారు. ఆ పోస్ట్‌లో ఇబ్రహీం తల్లి అమృతా సింగ్‌ను తను చిన్న వయసులో కలిశానని.. ఆమె ఎంతో ఆత్మీయంగా మాట్లాడేవారన్నారు.