calender_icon.png 17 January, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైఫ్ త్వరగా కోలుకోవాలి

17-01-2025 12:39:30 AM

దాడి ఘటనపై సినీ ప్రముఖుల స్పందన

బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌పై  జరిగిన దాడి ఘటనపై సినీ ప్రముఖులు స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమంటూ సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ పోస్టులు పెడుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్‌తోపాటు రాజ కీయ రంగాల వారు సైతం ఈ ఘటనపై స్పందిస్తున్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న సైఫ్ త్వరగా కోలుకో వాలని ఆకాంక్షిస్తున్నామని పేర్కొన్నారు.

చిరంజీవి, ఎన్టీఆర్ విచారం వ్యక్తం చేశారు. “సైఫ్ అలీఖాన్‌పై దాడి నన్ను ఎంతగానో కలచివేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా” అని చిరంజీవి పోస్ట్‌లో పేర్కొన్నారు. “సైఫ్ సర్‌పై దాడి జరిగిందని తెలిసి షాకయ్యా. ఇది నిజంగా బాధాకరం. ఆయన త్వరగా కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నా” అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.

మరోవైపు అభిమానులు సైతం సైఫ్ క్షేమం కోరుతూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. సైఫ్ చేతికి గాయం కావటంతో చికిత్స పొందుతున్నాడు. మిగతా కుటుంబ సభ్యులంతా క్షేమంగానే ఉన్నారు. ఈ ఘటనపై మీడియా ఎలాంటి ఊహాగానాలూ చేయొద్దు.

పోలీసులు దర్యాప్తు చేస్తున్నందున ఓపిక పట్టండి’ అని పేర్కొంటూ సైఫ్ భార్య, నటి కరీనా కపూర్ ఓ ప్రకటన విడుదల చేశారు. సైఫ్‌ను పరామర్శించేందుకు నటుడు షారుఖ్ ఖాన్ బయలుదేరిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. మరోవైపు నటుడు, ఎంపీ రవికిషన్ సైతం ఈ ఘటనపై స్పందించారు. డైరెక్టర్ కునాల్ కోహ్లీ, నటి, నిర్మాత పూజా భట్ సైతం స్పందిస్తూ సైఫ్ త్వరగా కోలుకోవాలని వేడుకున్నారు.