- వారం రోజులు బెడ్‌రెస్ట్ తీసుకోవాలన్న వైద్యులు
- కొనసాగుతున్న నిందితుడి విచారణ
- సైఫ్ కొడుకు గదిలో దొరికిన నిందితుడి వెంట్రుకలు డీఎన్‌ఏ టెస్ట్‌కు..
ముంబై, జనవరి 21: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఆస్పత్రి నుంచి మంగళవారం డిశ్చార్జి అయ్యారు. నిందితుడి దాడిలో గాయపడిన ఆయన ఆరు రోజులుగా చికిత్స పొందిన విషయం తెలిసిందే. వైద్యులు ఆయనకు వారం పాటు బెడ్‌రెస్ట్ సూచించారు. ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండేందుకు కొంతకాలం బయటవ్యక్తులకు దూరం గా ఉండాలని సూచించినట్టు సమాచారం. డిశ్చార్జి సమయంలో ఆయనతో వెంట తల్లి షర్మిలా ఠాగూర్ ఉన్నారు.
సైఫ్ సతీమణి, న టి కరీనా కపూర్, కుమార్తె సారా అలీఖాన్ ఆస్పత్రి నుంచి అంతకుముందే ఇంటికి వెళ్లా రు. సైఫ్ వేగంగా కోలుకోవడంపై ఆయన సోదరి సబా పటౌడీ సంతో షం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
విచారణలో కీలక విషయాలు
సైఫ్ అలీఖాన్‌పై దాడికి పాల్పడిన మహ్మద్ షరీపుల్ ఇస్లాం షెహజాద్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రాథమిక విచారణలో నిందితుడికి సంబంధించిన కీలక విషయాలను పోలీసులు వెల్ల డించారు. వారు తెలిపిన వివరాల ప్రకా రం..షెహజాద్ 7 నెలల క్రితమే మేఘాలయలోని డౌకీ నదిగుండా భారత్‌లోకి అక్ర మంగా ప్రవేశించాడు.
ఇక్కడకు వచ్చాక విజయ్‌దాసుగా పేరుమార్చుకున్నాడు. ముంబై రావడానికి కొన్ని రోజుల ముందు స్థానిక వ్యక్తి ఆధార్ కార్డును ఉపయోగించి సిమ్ కా ర్డు తీసుకున్నాడు. నిందితుడు ఉపయోగించిన సిమ్ కార్డు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యక్తి పేరుతో రిజిస్టర్ అయ్యింది. నిందితుడు కూడా భారత్‌లో ఉంటున్నట్లు ఆధార్ తీసుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యాడు.
నిందితుడి వెంట్రుకలకు డీఎన్‌ఏ టెస్టు
సైఫ్ చిన్న కుమారుడు జహంగీర్ అలీఖాన్ గదిలో నిందితుడు షెహజాద్ టోపి దొరికిందని ముంబై పోలీసులు తెలిపారు. టోపి కింద కనిపించిన వెంట్రుకలను డీఎన్‌ఏ విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపినట్లు చెప్పారు. పోలీసులు నిందితుడి నుంచి వివరాలు రాబడుతున్నారు. సైఫ్‌పై దాడి చేసిన తర్వాత నిందితుడు బస్టాప్‌లో గాఢంగా నిద్రపోయాడని, వర్లీకి వెళ్లే ముందు బట్టలు మార్చుకున్నాడని వెల్లడించారు.
జనవరి 16 తెల్లవారుజామున బాంద్రాలోని సద్గురు శరణ్ భవనంలో ఉన్న బాలీవుడ్ స్టార్ ఇంట్లో దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ప్రవేశించాడు. ఈక్రమంలో జరిగిన దాడిలో నటుడు సైఫ్‌కు కత్తిపోట్లకు గురయ్యాడు. దాడి తర్వాత నిందితుడు బా్రందా రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి దాదర్‌కు, తర్వాత వర్లీకి, థానే నగరానికి వెళ్లాడు.