దాడి సమయంలో ప్రాణాలకు తెగించి పోరాటం
ముంబై, జనవరి 22: బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ తన ఇంట్లో పని చేసే ఎలియమ్మ ఫిలిప్‌కు రివార్డు ఇవ్వాలను కుంటున్నట్టు సంబంధిత వర్గాలు బుధ వారం పేర్కొన్నాయి. దాడి సమయంలో ఫిలిప్ ప్రదర్శించిన ధైర్యసాహ సాలకుగాను సైఫ్ దంపతులు ఫిలిప్‌ను కలిసి ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పడం తోపాటు రివార్డు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాయి.
ఫిలిప్ గత కొన్ని రోజులుగా సైఫ్ చిన్న కుమారుడు జహంగీర్‌కు సంబంధిం చిన సంరక్షణ బాధ్య తలు చూసుకుంటు న్నారు. ఈ నెల 16న రాత్రి సైఫ్‌పై దుండగు డు దాడి చేస్తుండగా ప్రాణాలకు తెగించి ఫిలిప్ అతడిని అడ్డుకునే ప్రతయ్నం చేశారు.
ఇదిలా ఉంటే చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి సైఫ్ డిశ్చార్జ్ అయ్యారు. అంతకు ముందు తనను ఆటోలో ఆసుపత్రికి తీసుకె ళ్లిన ఆటో డ్రైవర్‌ని కలిసి కృతజ్ఞతలు తెలిపా రు. డ్రైవర్‌ను ఆప్యాయంగా కౌగిలిం చుకుని కాసేపు ముచ్చటించారు.