calender_icon.png 23 January, 2025 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిస్క్‌లో సైఫ్ అలీఖాన్ ఆస్తి

23-01-2025 12:45:28 AM

  1. ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం స్వాధీనానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం
  2. విలువ సుమారు రూ.15వేల కోట్లు

న్యూఢిల్లీ, జనవరి 22: ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ కుటుంబానికి చెందిన రూ.15వేల కోట్ల ఆస్తిని కేంద్రం స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. పటౌడీ ఆస్తులపై 2015లో విధించిన స్టే ఆర్డర్‌ను తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు ఎత్తేసింది.

దీంతో పటౌడీ వంశానికే చెందిన సైఫ్ అలీఖాన్‌కు సంబంధించిన రూ.15వేల కోట్ల విలువైన ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు లైన్ క్లియరైంది.

అసలు కేసు ఏంటంటే..

దేశ విభజన తర్వాత పాకిస్థాన్‌కు వలస వెళ్లిన వారి స్థిరాస్తులను కేం ద్ర ప్రభుత్వం ఎనిమీ ప్రాపర్టీ యా క్టు ప్రకారం స్వాధీనం చేసుకుంటుం ది. భోపాల్ చివరి నవాబు హమీదుల్లా ఖాన్‌కు ముగ్గురు కుమార్తెలు ఉండగా.. ఆయన పెద్ద కుమార్తె అబిదా సుల్తాన్ పాక్‌కు వెళ్లగా, రెం డో కుమార్తె సాజిదా ఇక్కడే ఉండి  ఇఫ్తికర్ అలీఖాన్ పటౌడీని పెళ్లి చేసుకుంది.

దీంతో పటౌడీ ఆస్తులకు ఆమె చట్టపరమైన వారసురా లయ్యారు. సాజిదా మనువడే సైఫ్ అలీఖాన్ కావడం వల్ల పటౌడీ ఆస్తుల్లో సైఫ్‌కు వాటా లభిస్తుంది. అయితే అబితా సుల్తాన్ పాక్‌కు వెళ్లడం వల్ల ఆ ఆస్తిని ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం స్వాధీనం చేసుకునేందుకు యత్నించింది. దీం తో ఈ వివాదం కోర్టు కెళ్లింది. ఈ క్రమంలోనే 2015లో ఎంపీ హైకోర్టు ఆస్తులపై స్టే విధించింది. తాజాగా కోర్టు ఆ స్టేను ఎత్తేసింది.