calender_icon.png 10 January, 2025 | 9:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంతో సాయిధరమ్ తేజ్ భేటీ

15-07-2024 02:24:31 AM

హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డితో టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ భేటీ అయ్యారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలి శారు. ఈ భేటీలో మంత్రి కొండా సురేఖతోపాటు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ నేత రోహిన్‌రెడ్డి ఉన్నారు. కాగా, ఇటీవల తండ్రి, కూతురి వీడియోను ఉద్దేశించి అసభ్యంగా కామెం ట్లు చేసిన వ్యవహారంలో యూట్యూబర్ ప్రణీత్ హనుమం తు నీచ బుద్ధిని సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వావివరుసలు లేకుండా ఫన్నీ పేరుతో చిన్న పిల్లలను ట్రోల్స్ చేస్తున్న ప్రణీత్ లాంటివారిని కఠినంగా శిక్షిం చాల ని కోరుతూ ఏపీ, తెలంగాణ సీఎంలతోపాటు డిప్యూటీ సీఎం లు, పోలీస్ శాఖకు విజ్ఞప్తిచేశారు. చిన్నపిల్లల జాగ్రత్తలపై సూచ నలు చేసిన సాయిధరమ్ తేజ్ ‘ఎక్స్’ పోస్టుకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపిన విషయం తెలిసిందే.