calender_icon.png 23 January, 2025 | 12:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగ్ అశ్విన్‌కు నో చెప్పా..

13-08-2024 12:00:00 AM

హిందీ రాని తమిళ అమ్మాయిగా ‘రఘుతాత’ చిత్రంతో ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది కీర్తి సురేశ్. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే సైన్ చేసిన ‘ఉప్పు కప్పురంబు’, ‘రివాల్వర్ రీటా’, ‘బేబీ జాన్’ వంటి ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. ‘కల్కి2898ఏడీ’లో బుజ్జి (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఆలోచించే మెషీన్)కు ఈ కోలీవుడ్ భామ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజా ప్రాజెక్టు ‘రఘుతాత’ కోసం విభిన్న రీతిలో ప్రమోషన్స్ చేస్తున్న కీర్తి.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కల్కి సినిమా గురించి ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పిందీ అమ్మడు.

“కల్కి2898ఏడీ’ చిత్రంలోని ఓ రోల్ కోసం డైరెక్టర్ నాగ్ అశ్విన్ నన్ను సంప్రదించారు. ఆ పాత్ర నేను చేయలేను కానీ, ఈ ప్రాజెక్టులో భాగం కావాలని ఉంది అని మెస్సేజ్ చేశా. ఆ తర్వాత ఆయన కాల్ చేసి బుజ్జి రోల్‌కు వాయిస్ ఓవర్ ఇవ్వాలని అడిగారు. నాకు మొదట అర్థం కాలేదు. షూట్‌లో నేను కూడా భాగం కావాల్సిన అవసరం లేదా? అని అడిగా. లేదు కేవలం వాయిస్ ఓవర్ ఇస్తే చాలు అన్నారాయన. దీంతో నేను వెంటనే ఓకే చెప్పేశా. వాయిస్ ఓవర్ విషయంలో నాగ్ అశ్విన్ నాకెంతో సాయం చేశారు’ అని చెప్పుకొచ్చిందీ సొగసరి. అంతేకాకుం డా ‘కల్కి’ రెండో భాగం కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పిన కీర్తి సురేశ్ తనకు కల్కి పార్ట్ ఆఫర్ చేసిన పాత్ర పేరు చెప్పడానికి నిరాకరించింది.